Narendra Modi: మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి పుతిన్, షింజో అబే, దుబాయ్ యువరాజు!

  • గతంలో సార్క్ దేశాధినేతలను ఆహ్వానించిన మోదీ
  • ఈసారి కూడా విదేశీ నేతలను ఆహ్వానించాలని నిర్ణయం
  • ఐరాసలోని పీ-5 సభ్య దేశాలకు ఆహ్వానం?

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకున్న ప్రధాని నరేంద్రమోదీ రెండోసారి ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 30న మోదీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతుండగా, ఈ కార్యక్రమానికి విదేశీ నేతలను ఆహ్వానించాలని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2014లో మోదీ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలు హాజరయ్యారు. ఈసారి కూడా విదేశీ నేతలను ఆహ్వానించాలని మోదీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా తనతో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు కలిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జపాన్‌ ప్రధాని షింజో అబే, అబుదబీ యువరాజు, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతాన్యాహు తదితరులను ఆహ్వానించాలని యోచిస్తున్నట్టు సమాచారం. అలాగే, ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యదేశాలైన (పీ-5) అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్ దేశాధి నేతలను కూడా ఆహ్వానించాలన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమైనట్టు తెలుస్తోంది.

Narendra Modi
swearing ceremony
India
Russia
Dubai
  • Loading...

More Telugu News