Team India: విరాట్ కోహ్లీ రాజులా కనిపిస్తున్నాడు.. కెప్టెన్ల గ్రూప్ ఫొటోపై నటి తాప్సీ స్పందన

  • మరో నాలుగు రోజుల్లో ప్రపంచకప్ 
  • పది దేశాల కెప్టెన్ల గ్రూప్ ఫొటోను షేర్ చేసిన క్రికెట్ వరల్డ్ కప్
  • తమ కలలు నిజం కావాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేసిన నటి

మరో నాలుగు రోజుల్లో ప్రపంచకప్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్న జట్లు ప్రాక్టీస్ మ్యాచుల్లో తలమునకలై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌లో పాల్గొనే పది జట్ల కెప్టెన్లతో కూడిన ఫొటోను క్రికెట్ వరల్డ్ కప్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ ఫొటోలో ఓ కుర్చీలో కూర్చున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కాళ్ల చెంత  ప్రపంచకప్ ట్రోఫీ ఉంది. ఈ ఫొటోపై బాలీవుడ్ ప్రముఖ నటి తాప్సీ పన్ను స్పందించింది. ‘‘ఫొటో చాలా బాగుంది. ప్రపంచకప్‌ను తన కాళ్ల దగ్గర పెట్టుకున్న కోహ్లీ రాజులా కనిపిస్తున్నాడు. దీనికి అతడు అర్హుడే. ఇది నిజం కావాలని కోరుకుంటున్నా’’ అని ట్వీట్ చేసింది.  

కాగా, లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌ మైదానంలో న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన 39.2 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 180 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కివీస్ 37.1 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

Team India
Actress tapsi pannu
world cup
Group photo
  • Loading...

More Telugu News