Stalin: మోదీ ప్రభుత్వానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన స్టాలిన్
- పరిధులకు లోబడి మాత్రమే ఉండాలి
- ఏ ఒక్క రాష్ట్రాన్నీ విస్మరించడానికి వీల్లేదు
- హిందీ మాట్లాడే రాష్ట్రాలనే గుర్తించే రోజులు పోయాయి
కేవలం హిందీ మాట్లాడే రాష్ట్రాలనే మోదీ గుర్తించే రోజులు పోయాయని, ఆ రాష్ట్రాలతోనే దేశం నిర్మితం కాలేదని గుర్తుంచుకోవాలని నరేంద్ర మోదీకి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ చిన్న హెచ్చరిక లాంటి సందేశమిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని మెజారిటీని సాధించిన నేపథ్యంలో స్టాలిన్ స్పందించారు.
తమిళనాడులో 38 సీట్లకు గాను డీఎంకే 36 సీట్లు గెలుచుకుంది. కానీ బీజేపీ అక్కడ ఖాతా కూడా తెరవలేకపోయింది. ఈ నేపథ్యంలో స్టాలిన్ మోదీని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘‘నిర్మాణాత్మక రాజకీయాలేమైనా పరిధులకు లోబడి మాత్రమే ఉండాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏ ఒక్క రాష్ట్రాన్నీ విస్మరించడానికి వీల్లేదు. కేవలం హిందీ మాట్లాడే రాష్ట్రాలనే మీరు గుర్తించే రోజులు పోయాయి. ఆ రాష్ట్రాలతోనే దేశం నిర్మితం కాలేదని మీరు గుర్తుంచుకోవాలి’’ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.