Lok Sabha: 16వ లోక్ సభను రద్దు చేస్తూ రాష్ట్రపతి సంతకం
- క్యాబినెట్ తరఫున నోట్ పంపిన ప్రధాని
- ఆమోదం తెలిపిన రాష్ట్రపతి
- త్వరలోనే 17వ లోక్ సభ ఏర్పాటు
కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు మార్గం సుగమం అయింది. 16వ లోక్ సభను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత లోక్ సభను రద్దు చేయాల్సిందిగా క్యాబినెట్ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన నోట్ పై రాష్ట్రపతి సంతకం చేశారు. దాంతో, 16వ లోక్ సభ కాలపరిమితి ముగిసినట్టయింది. వాస్తవానికి ప్రస్తుత లోక్ సభ గడువు జూన్ 3 వరకు ఉంది. ఇప్పటికే క్యాబినెట్ కూడా రద్దయిన సంగతి తెలిసిందే. త్వరలోనే 17వ లోక్ సభ కొలువుదీరడంతోపాటు మోదీ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ నెల 30న ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేస్తారు.