natgashourya: అనుష్క అంటే నాకు చాలా ఇష్టం: హీరో నాగశౌర్య

  • ఆటలపైనే ధ్యాస ఎక్కువ 
  • ఇంగ్లిష్ మూవీస్ ఎక్కువగా చూస్తాను
  •  అనుష్కను తీసుకోమనే చెబుతాను       

యువ కథానాయకులలో నాగశౌర్యకి మంచి క్రేజ్ వుంది. తన సొంత బ్యానర్ పై సినిమాలు చేస్తూ విజయాలను అందుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు.

 "చిన్నప్పటి నుంచి కూడా నేను చదువు మీద కంటే ఆటలపైనే ఎక్కువగా దృష్టిపెడుతూ వచ్చాను. ఖాళీ సమయం దొరికితే ఇంగ్లిష్ సీరియల్స్ .. సినిమాలు చూస్తుంటాను. నేను హీరో కాకముందు అనుష్కను ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవాడిని. నేను హీరో అయిన తరువాత కూడా నాకు అనుష్క అంటేనే ఇష్టం. నా సినిమాలో హీరోయిన్ ను ఎంపిక చేసుకునే అవకాశం దర్శక నిర్మాతలు నాకు ఇస్తే, అనుష్కను తీసుకోమని చెబుతాను. కాకపోతే నాతో చేయడానికి అనుష్క ఒప్పుకోవాలి గదా" అంటూ నవ్వేశాడు.

  • Loading...

More Telugu News