Guntur: గల్లా జయదేవ్ కు మహేశ్ బాబు అభినందనలు

  • గుంటూరు ఎంపీగా రెండోసారి గెలిచిన గల్లా జయదేవ్
  • తన బావకు అభినందనలు చెప్పిన మహేశ్
  • ‘బిగ్ కంగ్రాట్చులేషన్స్’ అంటూ ట్వీట్

గుంటూరు ఎంపీగా రెండోసారి విజయకేతనం ఎగరవేసిన టీడీపీ నేత గల్లా జయదేవ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా తన బావ గల్లా జయదేవ్ కు ప్రముఖ హీరో మహేశ్ బాబు అభినందనలు తెలిపాడు. గల్లా జయదేవ్ రెండోసారి ఎంపీగా ఎన్నికైనందుకు అభినందనలని, ఎంతో గర్వకారణంగా ఉందని అన్నాడు. కాగా, ఏపీలో టీడీపీ గెలిచిన మూడు ఎంపీ సీట్లలో గుంటూరు లోక్ సభ నియోజకవర్గం కూడా ఒకటి. ఇక్కడి నుంచి వైసీసీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై 4800 ఆధిక్యంతో గల్లా జయదేవ్ విజయం సాధించారు. 

Guntur
mp
Telugudesam
Galla jayadev
hero
Mahesh
  • Loading...

More Telugu News