Bollywood: ప్రజాస్వామ్యం విజయం సాధించింది.. మోదీకి బాలీవుడ్ నటుడు షారూక్ కంగ్రాట్స్

  • మోదీకి బాలీవుడ్ ప్రముఖుల నుంచి అభినందనలు
  • భారతీయులు గర్వపడేలా స్పష్టమైన తీర్పు ఇచ్చామన్న షారూక్
  • ఘన విజయం సాధించిన మోదీకి ఘనమైన అభినందనలంటూ ట్వీట్

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రధాని నరేంద్రమోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మోదీని అభినందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. విదేశాల నుంచి కూడా మోదీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా సార్క్ దేశాధి నేతలు మోదీకి ఇప్పటికే శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ ప్రముఖులు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, శిల్పాశెట్టి, అజయ్ దేవగణ్, రవీనాటాండన్, వరుణ్ ధవన్, పరిణీతి చోప్రా, కరణ్ జోహార్‌లు మోదీని అభినందిస్తూ ట్వీట్లు చేశారు.

తాజాగా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ మోదీని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన విజయమని పేర్కొన్నాడు. పనిచేసే వారికి పట్టం కడుతూ భారతీయులుగా గర్వపడేలా స్పష్టమైన తీర్పునిచ్చినట్టు చెప్పాడు. తమ ఆశలు, కలలు నిజం కావాలని ఆశిస్తున్నట్టు చెప్పాడు. ఘన విజయం సాధించిన మోదీకి ఘనమైన అభినందనలని షారూక్ పేర్కొన్నాడు.

Bollywood
Narendra Modi
Shahrukh Khan
  • Loading...

More Telugu News