Jagan: నేడు హైదరాబాద్‌కు జగన్.. గవర్నర్, కేసీఆర్‌లతో భేటీ
- తొలుత గవర్నర్ నరసింహన్‌తో భేటీ
- అనంతరం ప్రగతి భవన్‌లో కేసీఆర్, కేటీఆర్‌లతో సమావేశం
- ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం
వైసీపీ చీఫ్, ఏపీ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్ రానున్నారు. తొలుత గవర్నర్‌ను కలిసి ఆపై ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌లను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాలను గెలుచుకుంది.
ఈ నెల 30న విజయవాడలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. నేటి సాయంత్రం 4:30 గంటలకు జగన్ తొలుత రాజభవన్ చేరుకుని గవర్నర్ నరసింహన్‌తో భేటీ అవుతారు. అనంతరం ఐదుగంటలకు ప్రగతి భవన్‌కు చేరుకుని కేసీఆర్, కేటీఆర్‌లను కలుస్తారు. 30న విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి కుటుంబ సమేతంగా రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందజేస్తారు.