Vijayanagaram District: బొబ్బిలిలో ఇప్పటి వరకూ ముగ్గురు మంత్రులను ఓడించా: ఎమ్మెల్యే అప్పలనాయుడు

  • 1982లో కృష్ణమూర్తి నాయుడుని ఓడించా
  • ఆ తర్వాత జగన్ మోహన్ రావుపై గెలిచా
  • ఇప్పుడు సుజయ్ కృష్ణపై విజయం సాధించా

బొబ్బిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మంత్రులను ముగ్గురిని ఇంతవరకూ ఓడించానని అక్కడి నుంచి గెలుపొందిన వైసీపీ ఎమ్మెల్యే  వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, 1982లో కృష్ణమూర్తి నాయుడు, ఆ తర్వాత జగన్ మోహన్ రావును, ఇప్పుడు సుజయ్ కృష్ణ రంగారావును ఓడించానని, ఈ ముగ్గురూ మంత్రులుగా చేసిన వాళ్లేనని అన్నారు.

అయితే, వాళ్లిద్దరూ తమ సామాజిక వర్గానికి చెందిన వారని, సుజయ్ కృష్ణ కు మాత్రం సంస్థానాలు ఉన్నాయి, పూర్వీకులు సంపాదించిన డబ్బు, ‘మనందరి దగ్గర దొబ్బిన డబ్బు’ బోల్డెంత ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ డబ్బుతోనే వాళ్లు రాజకీయం చేశారు తప్ప, ప్రజాసంక్షేమం, అభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. వైసీపీలో గెలిచిన సుజయ్ కృష్ణ, కేవలం మంత్రి పదవి కోసం టీడీపీలోకి వెళ్లారని, ఇది గమనించిన ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్పి ఓడించారని అన్నారు. గతంలో బొబ్బిలిలో తాను చేసిన అభివృద్ధే తప్ప కొత్తగా జరిగిందేమీ లేదని అన్నారు.

Vijayanagaram District
bobili
mla
appalanaidu
  • Loading...

More Telugu News