Pasunuri Dayakar: కవిత, వినోద్‌ల ఓటమి చాలా బాధ కలిగించింది: పసునూరి దయాకర్

  • వరంగల్ ప్రజలకు రుణపడి ఉంటా
  • వరంగల్ అభివృద్ధికి పని చేస్తా
  • ప్రజా తీర్పును శిరసావహిస్తా

కల్వకుంట్ల కవిత, వినోద్ కుమార్‌ల ఓటమి తమకు చాలా బాధ కలిగించిందని టీఆర్ఎస్ వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు ఎంపీగా రెండోసారి అవకాశమిచ్చిన వరంగల్ ప్రజలకు రుణపడి ఉంటానని ఆయన వెల్లడించారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో వరంగల్ అభివృద్ధికి పని చేస్తానని దయాకర్ తెలిపారు. బీజేపీని ఒప్పించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను కేసీఆర్ తీసుకొస్తారని పేర్కొన్నారు. తాము ఆశించినన్ని సీట్లు రాకున్నా కూడా బాధ్యత గల ప్రజా ప్రతినిధులుగా ప్రజా తీర్పును శిరసావహిస్తామని దయాకర్ వెల్లడించారు.

Pasunuri Dayakar
Kavitha
Vinod Kumar
Warangal
KCR
BJP
  • Loading...

More Telugu News