Kavitha: కవిత ఓటమికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కారణం: జీవన్‌రెడ్డి

  • పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉంది
  • రైతుల్లో సైతం వ్యతిరేకత వ్యక్తమవుతోంది
  • ఇప్పటికైనా వైఖరిలో మార్పు తెచ్చుకోవాలి

సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓటమికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కారణమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముత్యంపేట ఫ్యాక్టరీని వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలపై కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వాళ్లే సరిగ్గా ఉండి ఉంటే కవితకు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదన్నారు. టీఆర్ఎస్ వైఖరిలో ఇప్పటికైనా మార్పు తెచ్చుకోవాలని జీవన్‌రెడ్డి హితవు పలికారు.

Kavitha
KCR
Jeevan Reddy
TRS
Mutyampeta
  • Loading...

More Telugu News