KCR: చాలా కాలం తర్వాత... హరీశ్‌తో కేసీఆర్ భేటీ!

  • సమావేశంలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత
  • పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై చర్చ
  • కవిత ఓటమిపై విశ్లేషించిన కేసీఆర్, హరీశ్

తెలంగాణ సీఎం కేసీఆర్, తన మేనల్లుడు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుతో భేటీ అయ్యారు. నేటి మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో వీరి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్టు తెలుస్తోంది.

పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాల తారుమారుతో పాటు కవిత ఓటమిపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 11 ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్, హరీశ్‌లు తొలిసారి భేటీ కావడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన హరీశ్, పార్లమెంట్ ఎన్నికలపై మాత్రం ఆసక్తిని కనబరచలేదు. ఇదే టీఆర్ఎస్‌ ఫలితంపై దెబ్బ కొట్టిందనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో హరీశ్‌తో కేసీఆర్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.

KCR
Harish Rao
Kavitha
Parliament
Siddipet
TRS
  • Loading...

More Telugu News