Andhra Pradesh: నా స్నేహితుడు, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్ కు శుభాకాంక్షలు!: డీఎంకే చీఫ్ స్టాలిన్

  • ఏపీలో వైసీపీ అద్భుత ప్రదర్శన చేసింది
  • సీఎంగా జగన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నా
  • ట్విట్టర్ లో స్పందించిన డీఎంకే అధినేత

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో భారీ మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గానూ వైసీపీ 22 సీట్లను దక్కించుకుంది ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో జగన్ నాయకత్వంలోని వైసీపీ అద్భుతమైన ప్రదర్శన చేసిందని ప్రశంసించారు. ఆయన ముఖ్యమంత్రిగా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

‘నా స్నేహితుడు, ఏపీకి కాబోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఆయన పదవీకాలం విజయవంతం కావాలనీ, ఏపీతో పాటు దక్షిణాది సరికొత్త ఎత్తులకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Jagan
YSRCP
dmk stalin
  • Loading...

More Telugu News