‘జగన్ వైఎస్ కంటే స్ట్రాంగ్ ఫెలో.. ఎప్పటికైనా అడ్డుపడతాడు’ అన్న భయంతో చంద్రబాబు తప్పుడు కేసులు వేయించారు!: పోసాని ఆగ్రహం
- జగన్ ను గూండా, రౌడీ, వాడు, వీడు అన్నారు
- అవినీతిపరుడని మీడియాలో రాయించారు
- న్యాయం ఉంది కాబట్టే జగన్ కు బెయిల్ వచ్చింది
జగన్ పై చంద్రబాబు, కాంగ్రెస్ పెట్టించినవి తప్పుడు కేసులు అని ప్రజలు నమ్మారని పోసాని తెలిపారు. ‘వీడు(జగన్) ఎప్పటికైనా అడ్డుపడతాడు. ఈ పిల్లవాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి కంటే స్ట్రాంగ్ ఫెలో.. అని మీరు కుట్ర పన్ని మీ పార్టీ(టీడీపీ) వాళ్లతో ఓ కేసు వేయించారు. కాంగ్రెస్ మీ మిత్రపక్షం కాబట్టి ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడితో దగ్గర ఉండి కేసు వేయించి జైలుకు పంపించారు.
దేవుడు ఉన్నాడు. న్యాయస్థానాలు ఇంకా న్యాయం చెబుతున్నాయి. ప్రజల పక్షాన ఉంటున్నాయి. అందుకే జగన్ కు బెయిల్ ఇచ్చి పంపించాయి. ఈ కేసులను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలి. అప్పుడే నేను మిమ్మల్ని(చంద్రబాబును) మనిషిగా గుర్తిస్తాను. ఇకపై ఈ కుట్రలు చేయొద్దు, కుతంత్రాలు చేయవద్దు’ అని హితవు పలికారు.