Guntur District: సందర్శకులతో కిటకిటలాడుతున్న జగన్‌ నివాసం

  • ఉదయం నుంచి పలువురు అధికారులు జగన్‌తో భేటీ
  • పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాకతో కోలాహలం
  • అభినందనలు తెలియజేసిన ప్రముఖులు

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇంటివద్ద కోలాహలం నెలకొంది. ఈరోజు ఉదయం నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన నివాస గృహానికి నాయకులు, అధికారులు క్యూ కడుతున్నారు. ఈనెల 30వ తేదీన జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అధినేతను కలిసి అభినందనలు అందజేస్తున్నారు. జగన్‌ను కలిసిన వారిలో పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతోపాటు పార్టీ ప్రతినిధులు ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక అధికారుల రాకతో జగన్‌ నివాసం వద్ద సందడి నెలకొంది. టీటీడీ ఈవో, వేదపండితులు కలిసి వేదాశీర్వచనం అందించారు.

Guntur District
tadepalli
jagan house
visitors
  • Loading...

More Telugu News