CBI Ex JD: తమ ఓటమిపై ట్వీట్ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ!

  • జనసేన తరఫున విశాఖ నుంచి బరిలోకి
  • ఎంవీవీ చేతిలో ఓటమి
  • ప్రజల్లోనే ఉంటానన్న లక్ష్మీనారాయణ

ఈ లోక్ సభ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ పడ్డ సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ, తన ఓటమిపై ట్విట్టర్ లో స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నానని అన్నారు. విజయం సాధించిన నరేంద్ర మోదీ, జగన్ లకు అభినందనలు తెలిపారు. తనపై విజయం సాధించిన ఎంవీవీ సత్యనారాయణను అభినందించారు. కొత్త ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తనకు ఓటేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజలకు సేవ చేసే విషయమై తనపని తాను చేసుకు వెళతానని అన్నారు.



CBI Ex JD
VV Satyanarayana
Defete
Twitter
  • Loading...

More Telugu News