Kangana Ranout: వంటగదిలో దూరి, పకోడీలు చేసి... మోదీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న కంగనా రనౌత్!

  • మొన్నటివరకూ కేన్స్ లో కంగనా
  • బిజేపీ బిగ్ విక్టరీపై వినూత్న సెలబ్రేషన్స్
  • ఫోటోలు పోస్ట్ చేసిన రంగోలీ

మొన్నటివరకూ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉండి, ఇండియాకు తిరిగొచ్చిన బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్, బీజేపీ సాధించిన ఘన విజయాన్ని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకుంది. బీజేపీ విజయానికి పొంగిపోయిన ఆమె, వంటగదిలో దూరి, స్వయంగా పకోడీలు చేసిందట. ఈ విషయాన్ని ఆమె సోదరి రంగోలీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలుపుతూ, కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. కంగన ఎంతో అరుదుగా మాత్రమే వంట చేస్తుందని, ఆమె చాలా సంతోషంగా ఉంటేనే గరిట పడుతుందని చెప్పుకొచ్చిన రంగోలీ, రుచికరమైన పకోడీలు చేసి, వాటితో పాటు కాఫీని తమకందించిందని చెప్పింది. 'జై హింద్‌.. జై భారత్‌' అన్న క్యాప్షన్ పెట్టి ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.



Kangana Ranout
Rangoli
Twitter
Pakodi
Narendra Modi
BJP
Victory
Celebrations
  • Loading...

More Telugu News