Jagan: తిరుమల నుంచి పూజా మాల, ప్రసాదం తెచ్చి జగన్ ను కలిసిన అనిల్ కుమార్ సింఘాల్, డాలర్ శేషాద్రి!

  • జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ ఈఓ
  • వెంట పలువురు ఉన్నతాధికారులు కూడా
  • త్వరలోనే తిరుమలకు వస్తానన్న జగన్

నవ్యాంధ్రకు కాబోయే సీఎం వైఎస్ జగన్ ను ఈ ఉదయం టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కలిశారు. తిరుమలలో స్వామివారికి ప్రత్యేకంగా ధరింపజేసిన పూజా మాల, ప్రసాదాలను తీసుకుని వచ్చిన ఆయన, జగన్ కు వాటిని అందించారు. ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. సింఘాల్ తో పాటు డాలర్ శేషాద్రి, మరికొందరు అధికారులు జగన్ ను కలిసిన వారిలో ఉన్నారు. సాధ్యమైనంత త్వరగా తాను స్వామివారిని దర్శించుకుంటానని ఈ సందర్భంగా జగన్ వారికి వెల్లడించారు.

Jagan
Tirumala
TTD
Anil Kumar Singhal
Dollar Seshadri
  • Loading...

More Telugu News