adithi rao: 'సర్దుకుపోతే అవకాశం ఇస్తాం .. లేకపోతే లేదు' అన్నారు: హీరోయిన్ అదితీరావు హైదరీ
- 'చెలియా' ద్వారా అదితీరావు పరిచయం
- 'సమ్మోహనం'తో మంచి గుర్తింపు
- పాత్ర నచ్చితేనే గ్రీన్ సిగ్నల్
'చెలియా' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అదితీరావు, 'సమ్మోహనం' సినిమా ద్వారా మరింత చేరువైంది. తెలుగుతో పాటు తమిళంలోను ఆమె వరుస అవకాశాలను అందుకుంటూ వెళుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ చిత్రపరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించింది.
"సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులు వున్నాయి. ఒక సినిమా విషయంలో 'సర్దుకుపోతే ఈ అవకాశం మీకు ఇస్తాము .. లేదంటే మరొకరికి ఈ ఛాన్స్ వెళుతుంది. ఆలోచించుకుని మీ నిర్ణయం చెప్పండి' అన్నారు. అలా అవకాశాలను సంపాదించుకోవలసిన అవసరం నాకు లేదు .. అందుకే నో చెప్పేసి ఆ ప్రాజెక్టును వదిలేశాను. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ధైర్యంగా మాట్లాడాలి. మౌనంగా వుంటే ఆ మౌనాన్ని మరో రకంగా అర్థం చేసుకునే అవకాశం వుంది " అని చెప్పుకొచ్చింది.