Uttar Pradesh: ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ... యూపీసీసీ అధ్యక్ష పదవికి రాజ్ బబ్బర్ రాజీనామా!

  • యూపీలో ఘోరంగా ఓడిన కాంగ్రెస్
  • రాజీనామా లేఖను రాహుల్ కు పంపిన రాజ్ బబ్బర్
  • గతంలో మూడు సార్లు లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన నేత

ఉత్తరప్రదేశ్‌ లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్ష పదవికి రాజ్‌ బబ్బర్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపారు. ఫతేపూర్ సిక్రీ నుంచి పోటీ చేసిన రాజ్ బబ్బర్,  బీజేపీ అభ్యర్థి రాజ్‌ కుమార్ ఛహర్ చేతిలో ఓడిపోయారు.

అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, మునిసిిపల్ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లోనూ రాజ్ బబ్బర్ కాంగ్రెస్ పార్టీని నడిపించి, వరుసగా వైఫల్యం చెందారు. దీంతో ఆయన రాజకీయ కెరీర్ పై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో రాజీనామాకు సిద్ధపడటం గమనార్హం. కాగా, రాజ్‌ బబ్బర్ మూడుసార్లు లోక్‌ సభకు, రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.

Uttar Pradesh
Rajbabber
Resign
Rahul Gandhi
  • Loading...

More Telugu News