Rajolu: అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరిచిన జనసేన.. రాజోలులో విజయం

  • పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పవన్ ఓటమి
  • రాజోలు నియోజకవర్గం నుంచి వరప్రసాద్ విజయం
  • తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన రాజోలు స్థానం

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఖాతా తెరిచింది. జనసేన అధినేత పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి పాలవగా, తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ విజయం సాధించడం విశేషం. వరప్రసాద్ గెలుపుతో పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తున్నాయి.

రాజోలు స్థానంలో వైసీపీ, జనసేన మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రౌండ్ రౌండ్‌కి ఫలితం మారుతూ తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. చివరకు స్వల్ప ఆధిక్యంతో విజయం జనసేన అభ్యర్థిని వరించింది. వరప్రసాద్ విజయం పట్ల పార్టీ అధినేత పవన్ హర్షం వ్యక్తం చేశారు. వరప్రసాద్‌కు అభినందనలు తెలిపారు.

Rajolu
Varaparasad
Pawan Kalyan
Janasena
YSRCP
  • Loading...

More Telugu News