Amith Shah: ఈవీఎంలపై పోరాడినట్టుగా ప్రజల కోసం చంద్రబాబు పోరాడి ఉంటే.. ఇంకో 4 ఓట్లు ఎక్కువ వచ్చేవేమో: అమిత్ షా

  • టీడీపీ ఓటమిపై అమిత్ షా స్పందన 
  • చంద్రబాబుపై విరుచుకుపడిన అమిత్ షా
  • ఆయన ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ఉంటే బాగుండేదన్న షా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో న్యూఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఈవీఎంలపై పోరాడినట్టు ప్రజా సమస్యలపై చంద్రబాబు పోరాడి ఉంటే ఇంకో నాలుగు ఓట్లు ఎక్కువగా వచ్చి ఉండేవంటూ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలను కూడగట్టే విషయంపై పెట్టిన దృష్టి చంద్రబాబు ప్రజా సమస్యలపై పెట్టి ఉంటే మరో నాలుగు ఓట్లు ఎక్కువ వచ్చి ఉండేవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకున్న జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Amith Shah
Telugudesam
New Delhi
Jagan
Chandrababu
BJP
  • Loading...

More Telugu News