Guntur District: సత్తెనపల్లిలో అంబటి చేతిలో కోడెల పరాజయం

  • సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీకి షాక్
  • కోడెలపై  అంబటి విజయం
  • 22 వేల మెజార్టీ సాధించిన అంబటి

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారన్న దానికి తెరపడింది. ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురైంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు ఘోరంగా ఓటమి పాలయ్యారు. కోడెలపై 22 వేల మెజార్టీతో అంబటి విజయం సాధించారు. కాగా, ఎన్నికల పోలింగ్ సమయంలో బూత్ ను పరిశీలించేందుకు వెళ్లిన కోడెలపై దాడి జరిగిన ఘటన సంచలనం రేకెత్తించింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. తమ గెలుపుపై అంబటి, కోడెలలు ధీమా వ్యక్తం చేసినప్పటికీ, ఫలితం మాత్రం అంబటికి అనుకూలంగా వచ్చింది.

Guntur District
sattenapalli
kodela
ambati
  • Loading...

More Telugu News