Nalgonda: అసహ్యకరమైన, జుగుప్సాకరమైన రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిరస్కరించారు: ఉత్తమ్

  • నల్గొండ నుంచి ఉత్తమ్ ఘన విజయం
  • 25, 722 ఓట్ల మెజారిటీ సాధించిన ఉత్తమ్
  • అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలకు మధ్య తేడా స్పష్టం

నల్గొండ పార్లమెంటరీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఉత్తమ్ 25, 722 ఓట్ల మెజారిటీ సాధించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ, తన విజయం టీఆర్ఎస్ పార్టీ అహంకారానికి చెంప పెట్టులాంటిదని పేర్కొన్నారు.

తనను గెలిపించిన ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు. అసహ్యకరమైన, జుగుప్సాకరమైన రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిరస్కరించారన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు, లోక్‌సభ ఫలితాలకు తేడా స్పష్టంగా తెలిసిందన్నారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల విషయమై పూర్తి స్థాయిలో శుక్రవారం గాంధీ భవన్‌లో స్పందిస్తానని ఉత్తమ్ పేర్కొన్నారు.

Nalgonda
Uttam Kumar Reddy
Congress
TRS
Loksabha
  • Loading...

More Telugu News