Andhra Pradesh: దుర్మార్గుడి పీడ వదిలింది: టీడీపీ ఓటమిపై మోత్కుపల్లి నర్సింహులు

  • టీడీపీ ఘోర పరాజయంతో స్వీట్లు పంచిన మోత్కుపల్లి
  • రేపు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తా
  • వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు చెప్పిన వైనం

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ మాజీ నేత మోత్కుపల్లి నరసింహులు
మరోమారు విరుచుకుపడ్డారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలు కావడంపై మోత్కుపల్లి స్పందించారు. దుర్మార్గుడి పీడ వదిలిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేపు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తానని చెప్పారు. టీడీపీ ఘోర పరాజయం కావడంతో స్వీట్లు పంచారు. ఏపీలో విజయకేతనం ఎగరవేసిన వైసీపీ అధినేత జగన్ కు మోత్కుపల్లి శుభాకాంక్షలు తెలిపారు.

Andhra Pradesh
Telugudesam
mothkpalli
YSRCP
jagan
  • Loading...

More Telugu News