Botsa Satyanarayana Satyanarayana: జగన్‌పై ప్రజలకున్న విశ్వాసమే భారీ విజయానికి దారి తీసింది: బొత్స

  • జగన్ విజయం ఒక సునామీ
  • జగన్‌తో అభివృద్ధి సాధ్యమని నమ్మారు
  • చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు

మెజారిటీలు తాము ఊహించినవేనని, భారీ విజయానికి జగన్‌పై ప్రజలకున్న విశ్వాసమే దారి తీసిందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఏపీలో వైసీపీ సాధించిన తిరుగులేని విజయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్‌ గెలుపును ఒక సునామీగా అభివర్ణించారు.

ఏపీలో అభివృద్ధి జగన్ నాయకత్వంలోనే జరుగుతుందని ప్రజలు విశ్వసించారన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని బొత్స దుయ్యబట్టారు. అవినీతి కార్యక్రమాలు చేపట్టిన టీడీపీ పాలనకు భిన్నంగా తమ పాలన ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు ఐదేళ్లు అధికారాన్నిస్తే చంద్రబాబు దుర్వినియోగం చేశారని విమర్శించారు. చంద్రబాబు పథకాలపై ప్రజలకు నమ్మకం లేదని బొత్స పేర్కొన్నారు.

Botsa Satyanarayana Satyanarayana
Jagan
Chandrababu
Tsunami
Mejarity
Telugudesam
  • Loading...

More Telugu News