BJP: భోపాల్ లో డిగ్గీ రాజా ఓటమి.. సాధ్వీ ప్రజ్ఞా సింగ్ జయకేతనం

  • రెండు లక్షల మెజారిటీ 
  • వివాదాలకు మరోపేరు సాధ్వీ ప్రజ్ఞా
  • తీవ్ర వ్యాఖ్యలతో కలకలం రేపిన వైనం

వివాదాస్పద వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన బీజేపీ నేత సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోక్ సభ స్థానం నుంచి పోటీచేసిన ప్రజ్ఞా సింగ్ తన ప్రత్యర్థి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై దాదాపు రెండు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలైన ప్రజ్ఞాకు టికెట్ కేటాయించడంతో బీజేపీపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆపై ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరేపై వ్యాఖ్యలు, గాడ్సే వివాదంతో ప్రజ్ఞా సింగ్ పై బీజేపీ నేతలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. అయితే, అన్నింటినీ అధిగమిస్తూ ఈ వివాదాస్పద సాధ్వీ భారీ మెజారిటీతో గెలవడం పెద్ద విశేషం! 

BJP
Congress
Bhopal
  • Error fetching data: Network response was not ok

More Telugu News