Pawan Kalyan: పోటీ చేసిన రెండు చోట్లా పవన్ కల్యాణ్ ఓటమి

  • గాజువాక, భీమవరంలో పవన్ ఓటమి
  • గాజువాకలో వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి విజయం
  • భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ విజయం

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఊహించని దెబ్బ తగిలింది. ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు గాజువాక, భీమవరం స్థానాల్లో ఓటమి పాలయ్యారు. పవన్‌పై గాజువాకలో వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి విజయం సాధించగా, భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు. రాష్ట్రం మొత్తం మీద ఒక్క రాజోలు నియోజకవర్గంలో మాత్రం జనసేన అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అక్కడి స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ రౌండ్ రౌండ్‌కి ఫలితం తారుమారవుతుండటంతో ఈ స్థానం నుంచి ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

Pawan Kalyan
Janasena
Grandhi Srinivas
Nagireddy
YSRCP
  • Loading...

More Telugu News