YSRCP: వైఎస్ జగన్ ను కలిసిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

  • తాడేపల్లిలోని జగన్ నివాసానికి సుబ్రహ్మణ్యం
  • జగన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎస్ 
  • తాజా పరిణామాలపై చర్చించినట్టు సమాచారం

ఏపీలో వైసీపీ ‘ఫ్యాన్’ గాలి ప్రభంజనం సృష్టిస్తోంది. అత్యధిక స్థానాల్లో వైసీపీ లీడింగ్ లో ఉంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత జగన్ ను ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి కొద్ది సేపటి క్రితం ఆయన వెళ్లారు. జగన్ ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించినట్టు సమాచారం. తాజా పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జగన్ ని కలిశారు.

YSRCP
jagan
cs
lv subramanyam
tadepalli
  • Loading...

More Telugu News