Karimnagar District: కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆధిక్యం

  • 76 వేల 172 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న సంజయ్
  • నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ జోరు
  • మల్కాజ్ గిరిలో స్వల్ప ఆధిక్యంలో రేవంత్ రెడ్డి

కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆధిక్యత కొనసాగుతోంది. తన సమీప ప్రత్యర్థిపై 76 వేల 172 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదే విధంగా, నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కూడా తన ఆధిక్యత కొనసాగిస్తున్నారు. 44 వేల 337 ఓట్ల ఆధిక్యంలో అరవింద్ ఉన్నారు. మల్కాజ్ గిరిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. స్వల్ప ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు.
 

Karimnagar District
Nizamabad District
malkazgiri
  • Loading...

More Telugu News