Rahul Gandhi: వయనాడ్‌ నుంచి గెలుపొందిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ

  • అధికారికంగా ప్రకటించాల్సి ఉంది
  • ఈసారి అమేథి, వయనాడ్‌ నుంచి పోటీచేసిన రాహుల్ 
  • అమేథిలో మాత్రం వెనుకంజ

సొంత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో ఇంకా వెనుకబడే ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కేరళలోని వయనాడ్‌ నుంచి మాత్రం విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఎప్పుడూ అమెథీకే పరిమితమయ్యే రాహుల్‌ ఈసారి దక్షిణాదిలోని వయనాడ్‌ నుంచి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. 2009లో ఏర్పడిందీ నియోజకవర్గం. ఇక్కడ రాహుల్‌ గాంధీ గెలిచినట్లు  అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక అమేథిలో మాత్రం బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ నుంచి రాహుల్‌ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. అక్కడ ఆయన వెనుకంజలో ఉన్నారు.  

Rahul Gandhi
Kerala
vayanad
victory
  • Loading...

More Telugu News