Andhra Pradesh: వెనుకంజలో మంత్రులు నారాయణ, అఖిలప్రియ, గంటా!

  • అనూహ్య రీతిలో తీర్పు ఇస్తున్న ఏపీ ప్రజలు
  • 145 సీట్లు సాధించే దిశగా వైసీపీ
  • ఓటమి దిశగా సీనియర్ మంత్రులు

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఎవరూ ఊహించని అనూహ్యమైన తీర్పు ఇస్తున్నట్టు కనిపిస్తోంది. తమకు 120 నుంచి 130 సీట్లు వస్తాయని ముందునుంచి వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తుండగా, ప్రస్తుత ట్రెండ్స్ కనీసం 145 సీట్లలో వైసీపీ ఆధిపత్యాన్ని చూపుతున్నాయి. ఇక తెలుగుదేశం ప్రభుత్వంలోని ఎంతో మంది మంత్రులు ఓటమి దిశగా పయనిస్తున్నారు.

 మంత్రులు నారాయణ, అఖిలప్రియ, గంటా, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి తదితరులు వెనుకంజలో ఉన్నారు. మంగళగిరి నుంచి పోటీ పడిన నారా లోకేశ్, తొలి రౌండ్ లో స్వల్ప ఆధిక్యాన్ని చూపించినప్పటికీ, ఆపై వెనుకబడిపోయారు. ఇక్కడ మూడో రౌండ్ ముగిసేసరికి ఆళ్ల రామకృష్ణారెడ్డి దూసుకొచ్చారు. ఈ ఫలితాలతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సందడి మాయమైంది. ఈ ఉదయం పార్టీ కార్యాలయం వద్ద కనిపించిన కొద్దిమంది నేతలు, ఇప్పుడు వెనుదిరిగి వెళ్లిపోతున్న పరిస్థితి.

Andhra Pradesh
Elections
Counting
YSRCP
  • Loading...

More Telugu News