Andhra Pradesh: టీడీపీ కంచుకోటకు బీటలు.. పశ్చిమ గోదావరిలో మెజారిటీ స్థానాల్లో వైసీపీ జోరు!

  • 11 స్థానాల్లో లీడింగ్ లో వైసీపీ
  • గత ఎన్నికల్లో ఒక్కటీ గెలుచుకోని వైనం
  • విశాఖలో 12 సీట్లలో ఫ్యాను జోరు

2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి కంచుకోటగా నిలిచిన పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం గడ్డు పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో మిత్రపక్షం బీజేపీతో కలిసి ఏకంగా 15కు 15 స్థానాలు గెలుచుకున్న టీడీపీ ఈసారి ఒంటరిగా పోటీచేసి చతికిలపడింది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల ప్రకారం జిల్లాలో 11 స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా, టీడీపీ కేవలం 3 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. విశాఖపట్నంలోని 14 స్థానాలకు గానూ వైసీపీ 12 సీట్లలో ఆధిక్యం చూపుతోంది. తాజా ఫలితాల ప్రకారం వైసీపీ 130 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, టీడీపీ 30 స్థానాల్లో ఆధిక్యంలో వుంది.

Andhra Pradesh
West Godavari District
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News