BJP: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ బీజేపీదే హవా!

  • మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఆధిక్యంలో బీజేపీ
  • బీహార్‌లోనూ బీజేపీ గాలి
  • ఎస్పీ-బీఎస్పీ కూటమి 12 స్థానాల్లో ఆధిక్యం

దేశవ్యాప్తంగా బీజేపీ హవా మరోమారు కొనసాగుతోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ కాషాయ పార్టీ సత్తా చాటుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్‌తోపాటు బీహార్, ఉత్తరప్రదేశ్‌లోనూ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 11 స్థానాల్లో ఉంది. రాజస్థాన్‌లో 24 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ కేవలం ఒక్కదాంట్లోనే ఆధిక్యం కనబరుస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్‌లో 49, బీహార్‌లో 31 స్థానాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కూటమి 12 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. బీహార్‌లో ఆర్జేడీ 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

BJP
Congress
SP
BSP
Uttar Pradesh
Rajasthan
Madhya Pradesh
  • Loading...

More Telugu News