Sumalatha: ముందంజలో సుమలత, వెనకబడిన జయప్రద
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-2eb3bd90dcc7089951b5f5df8c8d41cc6c123156.jpg)
- రాహుల్‌పై పోటీ చేస్తున్న స్మృతి ఇరానీ ముందంజ
- దూసుకెళ్తున్న సుమలత
- వెనకబడిన ప్రకాశ్ రాజ్
కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన సినీనటి సుమలత మాండ్యాలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇటీవలే బీజేపీలో చేరి ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జయప్రద వెనకంజలో ఉన్నారు. బెంగళూరు సెంట్రల్ నుంచి బరిలో ఉన్న నటుడు ప్రకాశ్ రాజ్ వెనకంజలో ఉన్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అమేథీలో ముందంజలో ఉన్నారు.