Mamata banerjee: ఫలితాలకు ముందు పియానో వాయిస్తూ సేదదీరిన మమత.. సోషల్ మీడియాలో వైరల్!

  • విశ్రాంతి సమయంలో పియానో వాయించిన మమత
  • తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేసిన సీఎం
  • గంటల్లోనే లక్షలాది మంది వీక్షించిన వైనం

నిన్నమొన్నటి వరకు ఎన్నికల రణక్షేత్రంలో కత్తులు దూసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఇప్పుడు పియానో వాయిస్తూ సేద దీరుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తుది విడత ఎన్నికలు, ఫలితాల విడుదలకు మధ్య సమయం దొరకడంతో ఆమె ఇలా రిలీఫయ్యారు. తాను పియానో వాయిస్తున్న వీడియోను ఆమె స్వయంగా తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు. దీనిని ‘అమ్మ, మట్టి, మనిషి’కి అంకితమని పేర్కొన్నారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. పోస్టు చేసిన గంటలోనే 4 వేల షేర్లు, వేలాది లైక్‌లు వచ్చాయి. ఇప్పటి వరకు ఈ వీడియోను 5.72 లక్షల మంది వీక్షించారు.

Mamata banerjee
West Bengal
Maa Mati Manush
Piano
  • Loading...

More Telugu News