Vote Counting: ఎవరూ ఒక్క క్షణం కూడా కదలవద్దు: ఏజంట్లకు చంద్రబాబునాయుడు ఆదేశాలు

  • నేడు ఓట్ల లెక్కింపు
  • టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు
  • ఎటువంటి అలసత్వం వద్దని ఏజంట్లకు చంద్రబాబు ఆదేశం

నేడు సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనున్న నేపథ్యంలో, కౌంటింగ్ ఏజంట్లుగా నియమించబడ్డ వారు అత్యంత జాగ్రత్తతతో వ్యవహరించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఈ ఉదయం టెలీ కాన్ఫరెన్స్ లో ఏజంట్లు, పార్టీ నేతలతో మాట్లాడిన ఆయన, ఇదే విషయాన్ని తాను ముందు నుంచే చెబుతున్నానని అన్నారు.

 కౌంటింగ్ చివరి క్షణం వరకూ ఏజంట్లు కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలని, ఎటువంటి అలసత్వాన్ని ప్రదర్శించరాదని, పదుల సంఖ్యలో ఓట్ల తేడాతో విజయం దూరమయ్యే పరిస్థితి రావచ్చని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడినా టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ గెలుపును ఏ శక్తీ ఆపలేదని, అందరి శ్రమ, కార్యకర్తల పట్టుదల, కృషితో మరోసారి అధికారంలోకి రానున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Vote Counting
Chandrababu
Tele Conference
Telugudesam
  • Loading...

More Telugu News