MOZO: మోజో టీవీ సీఈఓ రేవతికి పోలీసుల నోటీసులు!

  • శబరిమల సీజన్ లో ప్రత్యేక చర్చ
  • దళితుడిని అవమానించారన్న ఆరోపణలు
  • అరెస్ట్ చేసే అవకాశం

గడచిన శబరిమల సీజన్ లో మహిళలకు అయ్యప్ప స్వామి ఆలయ ప్రవేశంపై టీవీ చర్చ జరిగిన వేళ, ఓ దళితుడిని అవమానించారనే అభియోగాలపై మోజో టీవీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రేవతికి బంజారాహిల్స్‌ ఏసీపీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయంలో గతంలోనే ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి. మరో ఒకటి, రెండు రోజుల్లో రేవతితో పాటు, యాంకర్‌ రఘు అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మోజో టీవీపై నాలుగు కేసులు విచారణ దశలో ఉన్నాయని, వాటిని విచారించి తగిన చర్యలు తీసుకుంటామని కూడా ఉన్నతాధికారులు వెల్లడించారు.

MOZO
Revati
Police
Notice
Sabarimala
  • Loading...

More Telugu News