Andhra Pradesh: విష్ణువర్ధన్ రెడ్డి చిలకజోస్యం చెప్పుకుంటే బాగుంటుంది: టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్

  • ఏపీలో టీడీపీ గెలిస్తే వైసీపీ నిలబడటం కష్టం
  • టీడీపీ ఓడితే ఆ పార్టీలో నాయకత్వ లోపాలొస్తాయన్న విష్ణువర్ధన్ 
  • ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోటన్న రాజేంద్ర ప్రసాద్

ఏపీలో ఒకవేళ టీడీపీ గెలిస్తే వైసీపీ నిలబడటం కష్టమని, వైసీపీ గెలిచి టీడీపీ ఓటమిపాలైతే ఆ పార్టీలో నాయకత్వ లోపాలు వస్తాయని ఓ చర్చా కార్యక్రమంలో ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నేత బాబూ రాజేంద్ర ప్రసాద్ ఈ వ్యాఖ్యలకు స్పందిస్తూ, విష్ణువర్ధన్ రెడ్డి చిలక జోస్యం చెప్పుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

బలమైన ఆదర్శాలు, ఆశయాలతో ఏర్పడ్డ పార్టీ తెలుగుదేశం అని అన్నారు. ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట అని, మొదటి నుంచీ కూడా అక్కడి నుంచి ఎక్కువ సీట్లు సాధిస్తున్నామని, అదేమాదిరిగా ఈసారి కూడా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్రలో 26 నుంచి 27 సీట్లు టీడీపీకి వస్తాయని, ఇందులో ఎటువంటి అనుమానం లేదని చెప్పారు.  

Andhra Pradesh
Telugudesam
babu rajendra prasad
bjp
  • Loading...

More Telugu News