Komatireddy Venkatareddy: రూ.కోట్ల ఖర్చుతో మంత్రులు, ఎమ్మెల్యేలు జల్సాలు చేస్తున్నారు: కోమటిరెడ్డి

  • ఇంటర్ అవకతవకలపై స్పందించలేదు
  • బాంబే టు గోవాకు షిప్‌లో క్యాంపు పెట్టాడు
  • భువనగిరి స్థానం ప్రత్యేకమైంది
  • 80 వేల నుంచి లక్ష మెజారిటీతో గెలవబోతున్నా

ఇంటర్ అవకతవకలపై స్పందించని విద్యాశాఖమంత్రి, బాంబే టు గోవాకు షిప్‌లో క్యాంపు పెట్టాడని అలాంటి మంత్రిని ఏమనాలని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో భువనగిరి స్థానం ప్రత్యేకమైనదని, దేశంలోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలవబోతున్న స్థానం భువనగిరి అని కోమటిరెడ్డి తెలిపారు.

తాను 80 వేల నుంచి లక్ష మెజారిటీతో గెలవబోతున్నట్టు కోమటిరెడ్డి తెలిపారు. గ్రామాల్లో మంచినీళ్లు లేకపోతే పట్టించుకోని తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్, ఎమ్మెల్సీ ఎన్నిక కోసం క్యాంపు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు. కోట్ల రూపాయల ఖర్చుతో రాజ్యసభ సభ్యులు, ఆరుగురు మంత్రులు, ఎమ్మెల్యేలు క్యాంపు రాజకీయాలు చేస్తూ జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News