DGP: రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర హోం శాఖ

  • మరికొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రారంభం 
  • అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
  • భద్రతను పటిష్టం చేయాలని సూచన

 లోక్‌సభ ఎన్నికలకు కౌంటింగ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో హింస చెలరేగే అవకాశం ఉందని భావించిన కేంద్ర హోంశాఖ కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది.

ఈ మేరకు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో పాటు డీజీపీలకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. శాంతి భద్రతల పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

DGP
Chief Secretary
Central Home ministry
  • Loading...

More Telugu News