Cricket: లండన్ లో కాలుమోపిన టీమిండియా
- ముంబయి నుంచి పయనమైన భారత ఆటగాళ్లు
- మే 30 నుంచి టోర్నీ
- జూన్ 5న భారత్ తొలి మ్యాచ్
ఐసీసీ వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియా కాసేపటి క్రితమే లండన్ చేరుకుంది. భారత జట్టు ఇవాళ వేకువజామున ముంబయి నుంచి ఇంగ్లాండ్ పయనమైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా 15 మంది ఆటగాళ్లతోపాటు కోచ్ రవిశాస్త్రి, ఇతర సహాయక సిబ్బంది కూడా సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇంగ్లీష్ గడ్డపై కాలుమోపారు. ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచకప్ ఈనెల 30న ప్రారంభం కానుంది. భారత్ తన తొలి మ్యాచ్ ను వచ్చే నెల 5నే దక్షిణాఫ్రికా జట్టుతో ఆడనుంది.
ఈ టోర్నీ గెలుపు గుర్రాల్లో భారత్ కూడా ఒకటని మాజీలు ఎప్పటినుంచో చెబుతున్నారు. దాంతో కోహ్లీ సేనపై భారీ అంచనాలే ఉన్నాయి. టీమిండియాకు ఒకప్పుడు అనేక ఘనవిజయాలు సాధించిన మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి వరల్డ్ కప్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, కప్ గెలవడం ద్వారా ధోనీకి ఈ టోర్నీని చిరస్మరణీయం చేయాలని భారత జట్టు భావిస్తోంది.