Andhra Pradesh: మా పార్టీ గెలుపు విషయంలో ఎలాంటి అనుమానం లేదు: మాగంటి రూప

  • 110కి పైగా అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలవబోతోంది
  • కనీసం 15 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తాం
  • టీడీపీకి జయం చేకూరాలని సుదర్శన హోమం చేశాం

ఏపీలో ఎన్నికలు అయిన తర్వాత నలభై రోజులూ చాలా మైండ్ గేమ్ నడిచిందని రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మాగంటి రూప అన్నారు. టీడీపీ విజయం సాధించాలని, చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని కోరుతూ రాజమండ్రిలోని విఘ్నేశ్వర ఆలయంలో లక్ష్మీగణపతి సుదర్శన హోమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, 110కి పైగా అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలవబోతోందని, అదేవిధంగా, కనీసం 15 ఎంపీ స్థానాల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ గెలుపు విషయంలో ఎలాంటి అనుమానం లేదని అన్నారు. ఓటమి భయంతోనే ఈవీఎంలపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారనడం కరెక్టు కాదని అన్నారు. ఈసారే కాదు, ఈవీఎంల తీరుపై గతంలో కూడా చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారని అన్నారు.

Andhra Pradesh
rajhahmandry
Telugudesam
maganti
rupa
Chandrababu
lakshmi ganapathi
homam
  • Loading...

More Telugu News