Andhra Pradesh: చంద్రబాబును చూస్తే జాలివేస్తోంది.. మరీ దిగజారిపోతున్నారు!: వైసీపీ నేత అవంతి శ్రీనివాస్

  • కాంగ్రెస్ నేతల కంటే రాహుల్ కు ఎక్కువ శాలువాలు కప్పుతున్నారు
  • ఆయన తీరుతో తెలుగువాళ్ల పరువు పోతోంది
  • విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చూస్తే జాలి వేస్తోందని వైసీపీ నేత, భీమిలి అభ్యర్థి అవంతి శ్రీనివాస్ తెలిపారు. చంద్రబాబు మరీ దిగజారిపోతున్నారనీ, కాంగ్రెస్ నేతల కంటే ఎక్కువగా రాహుల్ గాంధీకి ఆయన శాలువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన తీరుతో తెలుగువారి పరువు పోతోందని విమర్శించారు. విశాఖపట్నంలోని సీతమ్మధార షిర్డీ సాయిబాబా ఆలయంలో ఈరోజు అవంతి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో వైసీపీ కనీవినీఎరుగని ప్రభంజనం సృష్టించబోతోందని వ్యాఖ్యానించారు. మరో 24 గంటల్లో రాజన్న పాలన రాబోతోందని వ్యాఖ్యానించారు. అయితే బుద్ధి లేని బుద్ధా వెంకన్నలు కొందరు మీడియా ముందుకు వచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
avanti
  • Loading...

More Telugu News