Jagan: ముఖ్యనేతలతో కలిసి విజయవాడకు బయలుదేరిన వైఎస్ జగన్

  • రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్
  • లోటస్ పాండ్ నుంచి బయల్దేరిన వైసీపీ అధినేత
  • బెజవాడ పార్టీ ఆఫీసు నుంచి ఫలితాల తీరుతెన్నుల పరిశీలన

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాల కోసం సిద్ధమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసం నుంచి జగన్ హెలికాప్టర్ లో బెజవాడ పయనం అయ్యారు. ఆయన వెంట హెలికాప్టర్ లో పార్టీ ముఖ్యనేతలు కూడా ఉన్నారు. గురువారం ఓట్ల లెక్కింపు సందర్భంగా విజయవాడలోని వైసీపీ కార్యాలయం నుంచి జగన్ ఎన్నికల ఫలితాల తీరుతెన్నులను పరిశీలించనున్నారు. కాగా, ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా, మధ్యాహ్నానికి ఈవీఎం ఓట్ల విషయంలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. 

Jagan
YSRCP
Vijayawada
Hyderabad
  • Loading...

More Telugu News