bellamkonda: విలన్ గా సోనూ సూద్ అదరగొట్టేశాడు: దర్శకుడు తేజ

  • ఫోన్లోనే సోనూ సూద్ కి కథ చెప్పాను
  •  పాత్రను ఆయన బాగా అర్థం చేసుకున్నాడు
  •  తన కాస్ట్యూమ్స్ తనే తెచ్చుకున్నాడు 

వైవిధ్యభరితమైన కథా చిత్రాలను తెరకెక్కించడంలో తేజ సిద్ధహస్తుడు. సహజత్వానికి దగ్గరగా కథ .. పాత్రలు ఉండేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ఈ కారణంగానే ఆయన సినిమాలు మనసుకు పడుతుంటాయి. యూత్ కి నచ్చే కంటెంట్ కి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే తేజ, ఈ సారి యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పించనున్నాడు.

ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతుండటంతో, తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. "ఈ సినిమాలో విలన్ పాత్రకి సోనూ సూద్ అయితే బాగుంటాడని భావించాను. మంచి కథలు రాకపోతుండటంతో తాను తెలుగు సినిమాలు తగ్గించినట్టు ఆయన చెప్పాడు. దాంతో నేను ఫోన్ లోనే కథను వినిపించాను. తనకు బాగా నచ్చడంతో ఓకే అన్నాడు. తన పాత్రను బాగా అర్థం చేసుకుని, అందుకు తగిన కాస్ట్యూమ్స్ కూడా ఆయనే తెచ్చుకున్నాడు. ఈ సినిమాలోని పాత్ర ఆయనకి మంచి పేరు తీసుకురావడం ఖాయం" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

bellamkonda
kajal
  • Loading...

More Telugu News