Andhra Pradesh: టీడీపీ నేత శేఖర్ రెడ్డి హత్య.. తీవ్రంగా స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేశ్

  • కోట్ల సుజాతమ్మ అనుచరుడిగా ఉన్న శేఖర్ రెడ్డి
  • ఈరోజు నడిరోడ్డుపై హత్య చేసిన ప్రత్యర్థులు
  • దోషులను కఠినంగా శిక్షించాలన్న లోకేశ్

కర్నూలు జిల్లాలో టీడీపీ నేత శేఖర్ రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. బైక్ పై వెళుతున్న శేఖర్ రెడ్డిని అడ్డగించిన దుండగులు తలపై బండరాయితో మోది హత్య చేశారు. తాజాగా శేఖర్ రెడ్డి హత్యకు గురికావడంపై ఏపీ ఐటీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆధునిక సమాజంలో ఇలాంటి ఆటవిక చర్య అమానుషమని వ్యాఖ్యానించారు.

ఈ దారుణానికి తెగబడ్డ దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. శేఖర్ రెడ్డి కుటుంబానికి టీడీపీ అన్నవిధాలుగా అండగా ఉంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు. శేఖర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. కోట్ల సుజాతమ్మ అనుచరుడైన శేఖర్ రెడ్డి చనిపోవడంపై పలువురు టీడీపీ నేతలు సంతాపం తెలిపారు.

Andhra Pradesh
sekhar reddy
murder
Nara Lokesh
Twitter
  • Loading...

More Telugu News