YSRCP: వైసీపీకి ప్రశాంత్‌ కిశోర్‌ కొట్టిన డప్పు వాయిద్యం రేపటితో ముగియనుంది: దేవినేని ఉమ సెటైర్‌

  • రాష్ట్రంలో టీడీపీదే అధికారం
  • మైలవరంలో నా గెలుపును ఎవరూ ఆపలేరు
  • ఎన్నికల తర్వాత అభ్యర్థులతో జగన్‌ సమావేశం పెట్టుకోలేకపోయాడు

రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుందని, జగన్‌ ముఖ్యమంత్రి అవుతాడని ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌ కొన్నాళ్లుగా కొడుతున్న డప్పు వాయిద్యానికి రేపటితో తెరపడనుందని మంత్రి దేవినేని ఉమ సెటైర్‌ వేశారు. ఓట్ల లెక్కింపు తర్వాత వైసీపీ భవిష్యత్తు తేలిపోతుందన్నారు.

ఈరోజు ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ గెలుస్తుందని, మైలవరంలో తన విజయాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో టీడీపీ విఫలం చెందిందన్నది వైసీపీ చేస్తున్న ప్రచారం అని, ఇందులో వాస్తవం లేదన్నారు. ఎన్నికల తర్వాత అభ్యర్థులతో సమావేశం పెట్టుకునే స్థితిలో కూడా జగన్‌ లేరంటే ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ రాజకీయ కథ రేపటితో ముగియనుందన్నారు.

YSRCP
devineni uma
Telugudesam
victory is ours
  • Loading...

More Telugu News