Dwivedi: ఏపీ సీఈఓ ద్వివేదిని ప్రత్యేకంగా కలిసిన వైసీపీ నేత యార్లగడ్డ!

  • ప్రత్యర్థులు గొడవ చేయాలని చూస్తున్నారు
  • అదనంగా మరో పరిశీలకుడిని నియమించండి
  • ద్వివేదిని కోరిన యార్లగడ్డ

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని గన్నవరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యేకంగా కలిశారు. గురువారం నాడు ఎన్నికల కౌంటింగ్ జరగనున్న సందర్భంగా గన్నవరం కౌంటింగ్ కేంద్రానికి అదనంగా మరో పరిశీలకుడిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసేందుకే యార్లగడ్డ వచ్చినట్టు తెలుస్తోంది.

కౌంటింగ్‌ సందర్భంగా ప్రత్యర్థులు ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించిన ఆయన, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు. కాగా, గన్నవరం నుంచి యార్లగడ్డతో పాటు టీడీపీ తరఫున వల్లభనేని వంశీ ప్రధానంగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.  

Dwivedi
Yarlagadda
AP CEO
  • Loading...

More Telugu News