Road Accident: ఆగివున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన వోల్వో బస్సు.. పది మందికి గాయాలు

  • తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్‌, మరో ప్రయాణికుడు
  • తిరుపతి సమీపంలోని సి.మల్లవరం వద్ద ఘటన
  • క్షతగాత్రులు రుయా ఆసుపత్రికి తరలింపు

ఆగి ఉన్న లారీని, వోల్వో బస్సు వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో పది మందికి గాయాలు కాగా వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని సి.మల్లవరం వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.

 నాయుడు పేట నుంచి బెంగళూరుకు గాజు గ్లాసు లోడుతో వెళ్తున్న లారీని డ్రైవర్‌ సి.మల్లవరం వద్ద రోడ్డుపక్కన నిలిపాడు. అదే రోడ్డులో వెనుక నుంచి వస్తున్న ఓ వోల్వో బస్సు లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగంలోకి చాలా వరకు లారీ వెనుక భాగం చొచ్చుకుపోయింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికుల్లో పది మంది గాయపడగా వీరిలో డ్రైవర్‌, మరో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని  క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News